దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, మార్చి 9 : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80వేల 39ఉద్యోగాలను ఈ రోజు నుంచే భర్తీ చేస్తామని, అదే సమయంలో 11వేల 103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడంతో నిరుద్యో గయువతతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకరలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి… నీల్లకు డోకా లేకుండా చేశారని, ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపనున్నారని తెలిపారు.ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ .. స్వీట్లు పంపిపెడుతూ.. సంబురాలు జరుపుకున్నారు.
డివిజన్, వల్లబాయ్ పటేల్‌నగర్‌లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి జై తెలంగాణ ..జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వల్లబాయ్పటేల్నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్‌రావు, నాయకులు బస్వరాజు, అఖిల్ సాయిగౌడ్, కుమార్ యాదవ్, చంద్ర, అనిల్, సంజీవరావు, ఇర్ఫాన్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.
డివిజన్, సూరారం రాజీవ్‌గృహకల్ప సముదాయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్, గాంధీనగర్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ ఖాదర్, జల్దా లక్ష్మీనాథ్, నీలగిరి, బాలరాజు, తిమ్మయ్య, నవీన్, మురళి, అల్లావుద్దీన్, సురేశ్, అబ్జల్, రాంచందర్, సంపత్, ఫారుఖ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
కల నెరవేరబోతున్నది..
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన కల.. నేడు నెరవేరబోతున్నది. ఔవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించేందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై ఎన్నో కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. బాధ్యతతో పని చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు రుణ పడి ఉంటారు.
ఎన్నో ఏండ్ల నిరీక్షణ తీరనుంది..
ఉన్నత చదువులు చదివాం. రేపోమాపో ఉద్యోగాలు వస్తాయని భావించిన మాకు.. గత ప్రభుత్వాల హయాం నుంచి తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల భర్తీ ప్రకటనతో మాలాంటి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. కలలో కూడా అనుకోని ఈ సంచలన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగులందరూ సీఎంకు రుణపడి ఉంటారు.