అంబర్‌పేట/కాచిగూడ/గోల్నాక, మార్చి 9: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గం అంతటా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఉద్యోగ నియామకాలతో పాటు గరిష్ట వయో పరిమితిని పదేండ్లకు పెంచడం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలో పెద్ద ఎత్తున టపాకులు కాల్చారు. మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఫీవర్ దవాఖాన చౌరస్తాలో టపాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాక చందర్, మీసాల శంకర్, సతీష్‌చంద్ర, గులాబ్ సతీష్, శంకరన్న, అశోక్, నాగేందర్, శరత్‌కుమార్, భోజరాజు, ప్రవీణ్‌కుమార్, సంజయ్‌కుమార్,అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీరాములుముదిరాజ్, అరుణ్‌కుమార్‌రెడ్డి, అప్రోజ్పటేల్, యోబు, మిర్యాల రవీందర్, జీవన్‌గౌడ్, శివాజీయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, చంద్రశేఖర్, రాజేష్, సుధా
కర్, శివ, బాబు, ఇ.ఎస్.ధనుంజయ, అమీర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో పార్టీ నాయకులు భూపతి లక్ష్మణ్, ఆర్కేబాబు, రాము, లక్ష్మీ తదితరులు మిఠాయిలు పంచిపెట్టారు. కాచిగూడ డివిజన్ అధ్యక్షుడు భీష్మాదేవ్, ఓంప్రకాష్ యాదవ్‌ల ఆధ్వర్యంలో డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు, రవీందర్‌యాదవ్, సదానంద్, బి.కృష్ణాగౌడ్, పెంటం రమేష్, నర్సింహరెడ్డి, బబ్లూ, నాగేందర్ బాబ్జీ, శ్రీకాంత్‌యాదవ్, భాస్కర్, దినేష్, కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిడీపీరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీరమణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.గిరిధర్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, మహేందర్నాథ్గౌడ్, సునీల్, హబీబ్, సాయి, ఆకాష్, ఫయాజ్, శ్యామ్, అఖిల్, బొట్టు విజయ్, బాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను అన్నింటిని భర్తీ చేస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. ఇది మా లాంటి వారికి ఎంతో మంచిది. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని పదేళ్లకు పెంచడం మరింత ఆనందదాయకం. చాలా రోజులుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు నచ్చిన ఉద్యోగానికి పోటీ పడతాము.
సర్కార్ ఉద్యోగం సంపాదిస్తా
ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటన వెలువడడం చాలా ఆనందంగా ఉంది. తగిన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాను. మరోసారి సీఎం సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.