దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల/గాజులరామారం,మార్చి8 : మహిళా సాధికారిత దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్-గాజులరామారం సర్కిళ్ల పరిధితో పాటు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, జంట సర్కిళ్ల డీసీలు ప్రశాంతి, మంగతా యారుతో పాటు ఆయా విభాగాల మహిళా అధికారులతో కలిసి వేడుకల ను నిర్వహించారు. అలాగే పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు.
జర్కిళ్ల మున్సిపాలిటీ సిబ్బందికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చీరెలు పంపిణీ చేసిన అనంతరం సమైక్య గ్రూపులకు రూ.4.50 కోట్ల రుణాలను అందజేశారు.
డివిజన్లో కేఎం గౌరీశ్ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు.
సర్కిళ్ల ఉప కమిషనర్లు ప్రశాంతి, మంగతాయారుతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, మహిళా అధికారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
డివిజన్ బ్యాంకు కాలనీలో మహిళలకు క్రీడలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
త్రివేణి కిడ్స్ స్కూల్ ఆవరణలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎస్ఓ సుబ్బారావు, సీఆర్ఓ వెంకటరావు, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వాణి పాల్గొన్నారు.
డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో పారిశుధ్య మహిళా కార్మికులకు కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లకు మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి చీరలు అందజేసి సన్మానించారు. కార్య క్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ , డాక్టర్లు నిర్మల, శ్రీజ, అనుపమ, నాయకులు యూసుఫ్, శివాజీ, విజయ్, నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, సత్యం తదితరులు.
డివిజన్, మగ్దూంనగర్లోని కార్పొరేటర్ కార్యాలయం లో కార్పొరేటర్ కొలుకుల జగన్, శశికళ దంపతులు మహిళలతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.
డివిజన్, హెచ్ఎంటీ పైపులైన్ రోడ్డులో గల జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో నిర్వహించిన వేడుకల్లో కార్మికులు మహిళలతో కలిసి కేక్ చేశారు.
డివిజన్, దేవేందర్‌నగర్‌లో కుత్బుల్లాపూర్ సర్కిల్ యూత్ అధ్యక్షుడు అబిద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, నాయకురాలు లక్ష్మి, అరిగే వరలక్ష్మి, సమాఖ్య నాయకురాలు లక్ష్మి, కృష్ణవేణి, వనిత, మేకల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డివిజన్, మగ్దూంనగర్ భగత్‌సింగ్ మార్గ్‌లో గల శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ శో భారాణి ఉపాధ్యాయురాళ్లను శాలువాలతో సన్మానించారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళా పారిశుధ్య కార్మి కులను సత్కరించారు. అంతకు ముందు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూ డి నృత్యం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శంకరయ్యతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్ఎల్జీ వైద్యశాలలో మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. స్థానికంగా ఉన్న గోకరాజు రంగరాజు కళాశాలకు చెందిన 320 మంది విద్యార్థులకు, అధ్యాపకులు, సిబ్బందికి ఎస్ఎల్జీ వైద్యులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు.
దుండిగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రిసోర్స్ పర్సన్లు, దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, ఆశ వర్కర్లు, మహిళా పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని మున్సిపాలిటీ చైర్పర్సన్ సుంకరిక్రిష్ణ వేణికృష్ణ సత్కరించారు. అనంతరం చీరెలు పంపిణీ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు ..
ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవంలో కళాశాల కోశాధికారి మర్రి మమతారాజశేఖర్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వర్ధమాన నటి వర్ష, జేఎన్టీయూహెచ్ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ శోభారాణి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన అధిపతులు రాధికాదేవి, మధురవాణి, అనుప్రియ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్తో పాటు కౌన్సిలర్లు డప్పు కిరణ్, చింతల్ రవీందర్‌యాదవ్, కమిషనర్ రఘు,మాజీ ఎంపీపీ సన్న కవితల ఆధ్వర్యంలో సిబ్బందికి చీరెలు పంపి ణీ చేసి వేడుకలు నిర్వహించారు.
శివశివాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రోడ్‌లోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌యాదవ్, ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. అతిథి భవానీని సత్కరించారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ఆంజనేయులు, గణేశ్, రాజు, దయానంద్ పాల్గొన్నారు.
ఎస్ఎల్ఎన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కిరణ్మయి, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.