ఎల్బీనగర్/వనస్థలిపురం/మన్సూరాబాద్/చంపాపేట/హయత్‌నగర్, మార్చి 8 : అన్ని రంగాలతోపాటు సైన్యంలో చేరిన మహిళలు యుద్ధరంగంలోనూ ముందుంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన సతీమణి దేవిరెడ్డి కమలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని తెలిపారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ హరిప్రియ, డాక్టర్ జయశ్రీ, వనస్థలిపురం ఎస్ఐ కమలాబాయి, నిర్మలాదేవి, సరస్వతి, నాగమణిరెడ్డి, సక్కుబాయి, వరలక్ష్మి, వర్దిని తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అండగా టీఆర్ఎస్ సర్కార్
మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నదని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేటలోని తన నివాసంలో మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాశ్‌గౌడ్, జీవీ సాగర్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాపోలు సుధాకర్, బొగ్గారపు శరత్చంద్ర, వరుణ్‌చంద్ర, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్, కోతి నర్సిరెడ్డి, విశ్వప్రేం, రాగిరి ఉదయ్ గౌడ్, శ్రావణ్‌కుమార్ గుప్తా, విజయరంగా, ఇటిక్యాల యాదగిరి, జహంగీర్‌తో పాటుగా మహిళా నాయకురాళ్లు రూపాసింగ్, సునీలారెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం డివిజన్లో..
గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లికారెడ్డి, శైలజ, విజయలక్ష్మి, రాణి, అరుంధతి, పద్మ, పరమేశ్వరి, నాగమణి, హసినా అంజలి, ఉషా నాయుడు, సుజాత, వరలక్ష్మి తదితరులు కేక్ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రమేశ్ ముదిరాజ్, కందికంటి ప్రేంనాథ్ గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్రావు, ఆనంద్‌గౌడ్, కృష్ణారెడ్డి, బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ఆధ్వర్యంలో..
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్‌ఎంజే క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. డైరెక్టర్ డాక్టర్ జయలత ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సిబ్బందితో పాటుగా లయన్స్ క్లబ్ కోశాధికారి లయన్ రాం నరేశ్, లయన్ సాగర్, లయన్ లోకేశ్, లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
లా కాలేజీలో..
చైతన్యపురిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ లా కాలేజీలో అంతర్జాయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు, చట్టాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఆర్ తిరుపతి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి హాజరై మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ప్రశాంతి, వైస్ ఫ్రిన్సిపాల్ రోజా రమణి, పీజీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హయత్‌నగర్ డివిజన్ వీరభద్రనగర్ కాలనీలో సావిత్రిబాయి ఫూలే మహిళా మండలి హయత్‌నగర్ మండల అధ్యక్షురాలు కళ్లెం సుజాతరెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, వివిధ రంగాల మహిళలు దాదాపు 200 మందిని సన్మానించి వారికి చీరలు పంపిణీ చేశారు. అంతకుముందు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రాంరెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి హాజరై మహిళలకు దుస్తువులు అందజేశారు. అనంతరం దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పద్మ, కల్పన, రజిని, స్వప్న, విజయ, శోభ, రాజేశ్వరి, వసంత, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవం
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సతీమణి దేవిరెడ్డి కమలాసుధీర్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. మహిళలతో కలిసి ఆమె కేక్‌ను కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం ఆమెను మహిళలు ఘనంగా శాలువాతో సన్మానించారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన మహిళలు మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షుడు కొసనం వెంకట్‌రెడ్డి, మహిళలు శ్యామల, ధనలక్ష్మి, కవిత, సుజాత నాయక్, రాణి, అలివేలు, స్వాతిరెడ్డి, శోభ, వసంత, నవ్య, పద్మ యాదవ్, జ్యోతి, సుధ, ఉదయశ్రీ, హేమలత, భ్రమరాంభ, మంజుల, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
కామినేనిలో..
ఎల్బీనగర్లోని కామినేని దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే వాక్‌ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు మీ ఆరోగ్యం ముఖ్యం పేరుతో నిర్వహించిన వాక్‌లో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో 2కే వాక్‌ను నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ వసుంధర కామినేని, సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని తదితరులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో
బండ్లగూడ, మల్లికార్జుననగర్ కాలనీలో బంగారు తెలంగాణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాశ్‌గౌడ్, చెరుకు సంగీత హాజరై కేక్‌ను కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు గౌరి, మంగమ్మ, లత, ఉమా, షాలిని, మౌనిక, పద్మ, బబిత, శోభ, సత్తమ్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస పార్టీ ఆధ్వర్యంలో..
మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్కే గార్డెన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ను కట్ చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రెస్కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ చేసిన వసంతలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజ్జి భాస్కర్‌యాదవ్, ఇరిగి రమేశ్, సతీశ్‌రెడ్డి, గాంధీనాయక్, చందూనాయక్, నాగయ్య, రమేశ్‌రెడ్డి, బాసు నాయక్, మహేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రాథమిక పాఠశాలలో..
చంపాపేట డివిజన్లోని కేంద్ర ప్రాథమిక పాఠశాలలో టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలను శాలువాతో సన్మానించి, పూలమొక్కలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి, నాయకులు ఉమామహేశ్వర్, మేక సురేందర్‌రెడ్డి, గోకుల్ సరోజ తదిరులు పాల్గొన్నారు.