బడంగ్‌పేట/మహేశ్వరం/ఆర్కేపురం/కందుకూరు/పహాడీషరీఫ్, మార్చి8: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజ మార్పు కోసం పాటు పడుతున్నారని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, మహిళా సంఘాలు, వివిధ విభాగాల మహిళా అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఈఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు రామిడి కవిత రాంరెడ్డి, పెద్దబావి శోభా ఆనంద్‌రెడ్డి, ముత్యాల లలితాకృష్ణ, బీమిడి స్వప్న జంగారెడ్డి, బోయపల్లి దీపికాశేఖర్, మాధురి వీర కర్ణారెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, రమాదేవి శ్రీనివాస్, రోహిణి రమేశ్, పద్మ, కోఆప్షన్ సభ్యులు గుర్రం ప్రసన్న వెంకట్‌రెడ్డి, జ్యోతి, సూర్ణగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, యాతం పవన్‌కుమార్, బండారు మనోహర్, పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మంజుల, మహిళా పోలీసులు, వైద్య సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి..
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని మీర్‌పేట మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్ అన్నారు. మంగళవారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళా కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులను, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
శివానీ డిగ్రీ మహిళా కళాశాలలో..
విద్యతోనే మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని శివానీ మహిళా డిగ్రీ కళాశాల సెక్రటరీ వెదిరే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేటలోని శివానీ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధ్యాపకులకు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల చైర్మన్ డా.రాంరెడ్డి, ప్రిన్సిపాల్ పి.అనిత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్లో..
ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్కేపురం చౌరస్తాలో కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, మాజీ అధ్యక్షుడు అరవింద్‌శర్మ, నాయకులు గొడుగు శ్రీనివాస్, సాజీద్, రాజు, కంచర్ల శేఖర్, మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిళారెడ్డి, మురుకుంట్ల విజయభారతి, శైలజారెడ్డి, అన్నపూర్ణమ్మ, అనురాధ, సుజాతారెడ్డి, జగిని రమేశ్, సైదాబేగం, బుజ్జిబాయి, యశోద, శంకర్‌నాయక్, శ్యామ్గుప్తా, ఎల్లన్న, రవీందర్‌రెడ్డి, జగన్, పబ్బు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కందుకూరు మండల కేంద్రంలో..
మండల కేంద్రంలోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, సర్పంచులు ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, కాకి ఇందిరమ్మ దశరథ, పొలెమోని బాలమణి అశోక్, ఎంపీటీసీలు లలితాకుమార్, సరళమ్మ, మహిళా నాయకులు జయమ్మ, యాదమ్మను శాలువాలతో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, సురుసాని సురేందర్‌రెడ్డి సన్మానించారు. అదేవిధంగా మహిళా మహిక్స్లో అధ్యక్షురాలు గంగాపురం కవిత కరుణాకర్‌రెడ్డి, పెంటమ్మ, స్వరూప, శ్రీలత, రజిత, సరిత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఎంపీపీ మంద జ్యోతి పాండును బీజేపీ నాయకులు సన్మానించారు. కొత్తూరులో సర్పంచ్ పల్లె వసంత కృష్ణాగౌడ్, దెబ్బడగూడ సర్పంచ్ ఏనుగు శ్రావణం జంగారెడ్డి, లేమూరులో పరంజ్యోతి మహిళా పాలక వర్గాలతో పాటు అధికారులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, పీఏసీస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సురుసాని సురేందర్‌రెడ్డి, బాలమల్లేశ్ యాదవ్, అందుల సత్యనారాయణ, పొట్టి ఆనంద్, సదానంద్‌గౌడ్, పాండురంగారెడ్డి, ఆనేగౌని పాండుగౌడ్ మండల కృష్ణ, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, రవికుమార్‌రెడ్డి, కాసోజు ప్రశాంత్‌చారి, బొక్క దీక్షిత్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందని 18వ వార్డు కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కౌన్సిలర్ దంపతులు లక్ష్మీనారాయణ విజయకుమారి జల్పల్లి మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పురుషులతో సమానంగా రాణించాలి..
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీడీవో నర్సింహులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు సామాజికంగా, రాజకీయంగా పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, మాజీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్‌అలీ, సర్పంచులు కరోళ్ల ప్రియాంకారాజేశ్, కంది అరుణరమేశ్, మద్ది సురేక కరుణాకర్‌రెడ్డి, సాలీవీరానాయక్, పద్మాపాండు, చంద్రశేఖర్‌రెడ్డి, ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.