మణికొండ, మార్చి 8 : మహిళలు ప్రగతి రథ సారథు లు అని మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్విజ్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు. అనంతరం తడి-పొడి చెత్త సేకరణపై ప్రత్యేక నాటక కార్యక్రమాన్ని నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. పారిశుధ్య కార్మికులను, మహిళా కౌన్సిలర్లను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఫల్గుణ్కుమార్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డిలు ఘనంగా సన్మానించారు.
మహిళలు ఆదర్శంగా నిలువాలన్న సంకల్పంతో ముందుకు సాగితే భవిష్యత్ అంతా వారిదేనని నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి అన్నారు. మంగళవారం నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అరుణజ్యోతి, సునీత, యాదమ్మ, ప్రవళిక, కో-ఆప్షన్ సభ్యురాలు కళమ్మ, శోభారాణి, ప్రియదర్శిని పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్దతూప్రలో సుల్తాన్‌పల్లి, కేబి దొడ్డి గ్రామాల మహిళలు, ప్రజాప్రతినిధులతో కలిసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, ఉప సర్పంచ్ స్పందనగౌడ్, వార్డు సభ్యులు మౌనికరెడ్డి, సత్యమ్మ, మాలకృష్ణ, చంద్రశేఖర్,నాయకులు కుమార్‌గౌడ్, మల్లికార్జున్,గోపాల్ త దితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ పరిధిలో బీఆర్కే గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మేయర్ మహేందర్‌గౌడ్ మహిళా కార్పొరేటర్లను, అధికారులను సన్మానించారు.
రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాలలో డీన్ గిర్వాణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కబడ్డీ, పాటలు , ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జ్యోతి, వెంకట లక్ష్మి, నాగహర్షిత పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ నియోజక వర్గంలో మహిళా దినోత్సవాన్ని కార్పొరేటర్లు ఘనంగా నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్లును సన్మానించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్, శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, పీరం చెరువు, తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించుకున్నారు.