దక్షిణ మధ్య రైల్వేకు.. ఇంధన పొదుపు పురస్కారాలు
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగు రైల్వే విభాగాలకు ‘తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు అవార్డు-2022’ అవార్డులు దక్కాయి.
- బహుమతులు ప్రదానం చేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి..
సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాలుగు రైల్వే విభాగాలకు ‘తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు అవార్డు-2022’ అవార్డులు దక్కాయి. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ఇంధన పొదుపు అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంధన మంత్రిత్వ శాఖ, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్ఈడీసీవో) తరుపున మంత్రి ఈ అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఏపీకి రెండు పొదుపు అవార్డులను అందజేశారు. ఈ మేరకు ఎస్సీఆర్ జోన్ తరుపున అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. పొదుపు అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు గోల్డ్ వార్డు అందించారు. ఈ అవార్డును హైదరాబాద్ డివిజనల్ రైల్వే అధికారులు అందుకున్నారు. హైదరాబాద్ సంచాలన్ భవన్‌కు ఇంధన పొదుపులో గోల్డ్ అవార్డు అందుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సిల్వర్ అవార్డు అందజేశారు. అలాగే ఎస్సీఆర్ జోన్‌లోని సికింద్రాబాద్‌లో ఉన్న అకౌంట్స్ భవనానికి కూడా సిల్వర్ అవార్డు అందచేశారు. అలాగే ఎస్సీఆర్ జోన్ పరిధిలోనే ఏపీలో ఉన్న విజయవాడ రైల్వే ఆసుపత్రికి గోల్డ్ అవార్డు, విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సెంటర్‌కు సిల్వర్ అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్సీఆర్ జోన్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

