చిక్కడపల్లి,డిసెంబర్16 ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఫుట్‌పాత్‌లను కబ్జా చేసి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని చిక్కడపల్లి, గాంధీనగర్ ,రాంనగర్ ,కవాడిగూడ మేకలమండి, బండమైసమ్మ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులకు నడిచే స్థలం లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం బండమైసమ్మ ఫుట్‌పాత్ పై అక్రమంగా షాపు పెట్టి వ్యాపారాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై గాంధీనగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
ఫుట్‌పాత్‌లను కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాలను తొలగిస్తున్నాం. బండమైసమ్మ ఫుట్‌పాత్ పై అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న కేసు నమోదు చేశాం. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-ధరావత్ నాను నాయక్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్