శేరిలింగంపల్లి, డిసెంబర్ 16 : ప్రజా సంక్షేమం, అభివృద్ధిలకు కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్లో రూ.3.35 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల అభివృద్ధికి కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని, కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో యూజీడీ పనులు ఇప్పటికే పూరైన కాలనీలు, బస్తీలలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ప్రథమ వరుసలో ఉంచేందుకు శాయాశక్తుల కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఊట్ల క్రిష్ణ, రమేశ్, బలరాం యాదవ్, తిరుపతిరెడ్డి, గఫూర్, శ్రీనివాస్, తిరుపతి, రూపారెడ్డి, తిరుపతి యాదవ్, నందు, గణపతి, బసవరాజు, చారి, తదితరులు పాల్గొన్నారు.