గోల్నాక, డిసెంబర్ 3: అంబర్‌పేట డివిజన్‌లోనే నరేంద్రనగర్ను అభివృద్ధి చేసి ఆదర్శంగా మారుస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి నరేంద్రనగర్‌లో పర్యటించారు. అనంతరం బస్తీ వాసులతో ఆయన సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీటి సరఫరా సమస్యలతో పాటు కమ్యూనిటీ హాలు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధి లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. కొత్త డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల ఏర్పాటుతో పాటు కాలనీలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయంలో ధూపదీప నైవేద్యానికి నిధులు మంజూరు చేయించడంతో పాటు పూజారికి ప్రతి నెలా రూ.5 వేలు గౌరవ వేతనం తానే స్వంతంగా ఇస్తామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఆయన అంబర్‌పేట పోలీసులను ఆదేశించారు. బస్తీ ప్రతినిధులు చంద్రయ్య, బ్రహ్మచారి, కృష్ణాగౌడ్, భిక్షపతి, రమేశ్, యాదమ్మ, జయమ్మ, శ్రీకాంత్, కిరణ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థముదిరాజ్, నాయకులు లవంగు ఆంజనేయులు, ఎర్రబోలు నరసింహారెడ్డి, రామారావుయాదవ్, మల్లేశ్‌యాదవ్, రాగుల ప్రవీణ్, మహేశ్ముదిరాజ్, లత, రమేశ్‌నాయక్, సూరి, రోజా, వేణు పాల్గొన్నారు.
జెండాను ఎగురవేయడం అభినందనీయం..
అంబర్‌పేట, డిసెంబర్ 3: ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో లీడర్స్ ఫర్ సేవ, వందే ప్రజా సంస్థలు ముందుకు రావడం గర్వకారణమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నిత్య జనగణమనలో భాగంగా ఆయా సంస్థలు తిలక్‌నగర్ మెయిన్‌రోడ్డులో ప్రతి రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. శనివారం 200ల రోజు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఎగురవేసి వందన సమర్పన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 200 రోజులుగా ప్రతి రోజు క్రమం తప్పకుండా జెండాను ఎగురవేస్తుండడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు నేలంటి మధు, నూతి శ్రీకాంత్, ప్రసాద్ దూబేలతో పాటు నాయకులు భాస్కర్‌గౌడ్, కూర నరేందర్, రాముయాదవ్, పూర్ణచందర్రావు, నిరంజన్, రేణుక, సతీశ్, సురేశ్, వీరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రామ మందిరం పనులకు శంకుస్థాపన
కాచిగూడ,డిసెంబర్ 3: ఏకాగ్రతతో దేవుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ చెప్పల్‌బజార్‌లోని క్వాలిటీ గార్డెన్లో అపార్ట్మెంట్ వాసులు నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం పనులకు శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్మెంట్లో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్, నారాయణమూర్తి, అరవింద్, ఆనంద్‌జైన్, అనిల్ మధుర, అరుణ్, చైతన్య పాల్గొన్నారు.