గౌతంనగర్, నవంబర్ 23 : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి బూత్‌స్థాయి కమిటీలు పనిచేయాలని, అలాగే స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంలో కీలక పాత్ర వహించాలని మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం మౌలాలిలోని బహార్ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సత్తయ్య, నాయకులు అమీనొద్దీన్, భాగ్యానందరావు ఆధ్వర్యంలో బూత్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాల మేరకు బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి.. సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, పార్టీ బలోపేతానికి పనిచేసే బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందేలా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి ని ప్రజలకు వివరించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అభివృద్ధిపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేస్తున్న అభివృద్ధిని ఆయన వివరించారు. బూత్ కమిటీలు ఐక్యతతో ముం దుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎండీ ఉస్మాన్, ఆదినారాయణ, సంతోశ్నాయుడు, రోలెక్స్ గణేశ్, సంతోష్‌గుప్తా, మహేశ్‌గౌడ్, కాశీనాథ్‌యాదవ్, మంద భాస్కర్, అఖిల్, ఎండి.సాధిక్, శైలేందర్, కాశప్ప, దినేశ్, సంపత్, మైమూదాబేగం, ఫర్వీన్, జాన్‌బీ పాల్గొన్నారు.