వెంగళరావునగర్, నవంబర్ 22: నియోజకవర్గ ప్రజలకు పుష్కలంగా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ రహ్మత్‌నగర్ కమాన్ గల్లీలో రూ.8 లక్షలు వ్యయంతో చేపట్టిన తాగునీటి పైప్‌లైను పనులు, జవహర్‌నగర్ మసీద్గడ్డలో రూ.5.5 లక్షలతో తాగునీటి పైపు లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని.. దాంతో బస్తీలు, కాలనీల్లో పుష్కలంగా తాగునీటిని అందించబోతున్నామని చెప్పారు. పురాతనకాలం నాటి పైపులైన్లతో గతంలో తాగునీటికి సమస్యలు ఉత్పన్నమయ్యేవని.. తాగునీటి కోసం అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రజల అవసరాలకు తగినట్టుగా నిధులను మంజూరు చేస్తున్నామని.. దాంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు తాగునీటి సమస్యను విస్మరించారని.. గతంలో తాగునీటి కోసం కుళాయిల వద్ద కొట్లాటలు జరిగేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండబోదని అన్నా రు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. త్వరగా పనుల్ని చేపట్టి.. పూర్తి చేసి ప్రజలకు కావాల్సిన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన వాటర్ వర్క్స్ అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజ య్, వాటర్ వర్క్స్ డీజీఎం వాహబ్, మేనేజర్ రమేష్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేశ్, కిట్టు, సత్యనారాయణ, నవాజ్, పవన్, వార్డ్ సభ్యులు, ఏరియా సభ్యు లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.