బాలానగర్, నవంబర్ 22 : బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసి పోయింది. స్టేషన్లో గదులు మినహ ఖాలీ స్థలమంతా ద్విచక్ర వాహనాలతో నిండి పోవడంతో అధికారులకు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. గంజాయి విక్రయాలలో పట్టు బడిన వ్యక్తుల వాహనాలతో కిక్కిరిసి పోయింది. అసలే అద్దె భవనంలో కొనసాగుతున్న ఇరుకైన ఎక్సైజ్ స్టేషన్.. ఆపై వాహనాల తాకిడి అధికం కావడం వలన స్టేషన్ పూర్తిగా నిండి పోయింది.
గంజాయి విక్రయదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉంటాయి. తమకు కోర్టు నిర్ణయమే శిరోధార్యం. కోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటాం. ఎక్సైజ్‌శాఖ పరిధిలో ఉన్న అంశం కాదు. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు గంజాయి విక్రయాలలో పట్టుబడిన వాహనాలు తమ వద్దే (ఎక్సైజ్ స్టేషన్లో) ఉంటాయి. కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇస్తేనే వాహనాలు విడుదల చేస్తాం. ఇటీవల రెండు వాహనాలను కోర్టు ఉత్తర్వుల మేరకు విడదల చేశాం.
– వేణు కుమార్, ఎక్సైజ్ సీఐ