బడంగ్‌పేట, నవంబర్ 20 : అభివృద్ధే ధ్యేయంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇటీవలే ప్రధాన రహదారులన్నింటికీ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటిస్తూ.. సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్ లీడర్లు అర్కల భూపాల్‌రెడ్డి, కీసర గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు ముద్దా పవన్, పసునూరి భిక్షపతి, కో-ఆప్షన్ సభ్యులు పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అర్కల కామేశ్‌రెడ్డి, 9వ డివిజన్ ఇన్చార్జి రామిడి నర్సింహారెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హాము నాయక్, డీఈఈ గోపీనాథ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో ..
మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట గ్రామంలో పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, సహకార బ్యాంకు చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ శ్రీశైలం గౌడ్, ఎంపీటీసీ రాయప్ప, ఉప సర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదిగిరి గౌడ్, దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.