కాప్రా, నవంబర్ 19: కాప్రా సర్కిల్లో ట్రేడ్ లైసెన్సుఫీజు వసూలు చేసేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ముమ్మ రంగా కొనసాగుతున్నది. లైసెన్సు ఫీజులు చెల్లించకుండా ఏండ్ల తర బడి పెండింగ్‌లో ఉంచిన వ్యాపార సంస్థలు, ఫంక్షన్‌హాళ్లు, బడా స్కూళ్లను గుర్తించి వారికి ట్రేడ్ లైసెన్సు కలిగి ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల చర్యలకు స్పందించిన వారికి వెంటనే ట్రేడ్ లైసెన్సు యాప్ ద్వారా లైసెన్సును జారీ చేసి.. వారి నుంచి రుసుంను సేకరిస్తున్నారు. స్పందించనివారికి నోటీసులను జారీ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసినా నిర్లక్ష్యంగా ఉండే వారికి రెడ్ నోటీసులు అందజేస్తున్నారు. రెడ్ నోటీసులకు కూడా స్పందించ కుంటే మున్సిపల్ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవాల్సి ఉం టుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శనివారం కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావు నగర్ ప్రాంతాల్లోని ఫంక్షన్‌హాళ్లు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలను సందర్శించి వారికి ట్రేడ్ లైసెన్సు ఫీజుల నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కాప్రాకు చెంది న ఓ ఫంక్షన్‌హాల్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసినా స్పందించకపో వడంతో ఏఎంఓహెచ్ డాక్టర్ స్వప్నారెడ్డి రెడ్ నోటీసు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 50 సంస్థలకు రెడ్ నోటీసులు జారీ చేసినట్లు ఏఎంఓహెచ్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాల్లో ఏఎంఓహెచ్ డాక్టర్ స్వప్నారె డ్డితో పాటు లైసెన్సింగ్ అధికారి రంజిత్, శానిటరీ సూపర్వైజర్ నాగరాజు, అసిస్టెంట్ లైసెన్సిం గ్ అధికారి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.