కవాడిగూడ, నవంబర్ 14 : సామెతలు మహాకావ్యాలని, జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రముఖ కవి, సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సోమవారం దోమలగూడలోని తెలుగుశాఖ, ఏవీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ వై.సత్యనారాయణ సంపాదకత్వంలో వెలువడిన ‘తెలుగు సామెతలు-సమగ్ర సమాలోచన’ అనే గ్రంథాన్ని ఆయన పలువురు ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్ర విద్యాలయ విద్యాసంస్థల అధ్యక్షుడు ఆచార్య కె.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడారు. సామెతలు పండితులు సృష్టించినవి కావని, అవి పామరులు సృష్టించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఆచార్య సాగి కమలాకరశర్మ, యాద శంకర మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంగిశెట్టి బాబు, ఏవీ కళాశాల పీజీ సెంటర్ సంచాలకులు డాక్టర్ ఎం.భగవంతరెడ్డి, ఏవీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పద్మ, తెలుగుశాఖ పీజీ సెంటర్ ఏవీ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మీవిజయ, తెలుగుశాఖ నిజాం కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ అట్టెం దత్తయ్య, హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బి.మదన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.