చర్లపల్లి, నవంబర్ 12 : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ, జీఆర్రెడ్డినగర్, శ్రీనగర్, విరాట్‌నగర్, భవానీనగర్, నార్త్ కమలానగర్ తదితర ప్రాంతాల్లో సుమారు రూ.1.56 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి.. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టా మని అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శంకర్, మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, ధన్‌పాల్‌రెడ్డి, ఏఈ తిరుమలయ్య, ఎస్సై షఫీ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, నాయకులు శేర్ మణెమ్మ, గరిక సుధాకర్, కృష్ణారెడ్డి, బేతాల బాలరా జు, మురళీపంతులు, లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారామిరెడ్డి, బాల్‌నర్సింహ, యాకయ్య, మొగులయ్య, సింగం రాజు, చంద్రమౌళి, నర్సింహ, శిరీషారెడ్డి, సజ్జ రామతులసి, మల్క రమాదేవి, సదాలక్ష్మి, అంజిరెడ్డి, రాఘవరెడ్డి, టీజీకే మూర్తి, రహీం, సతీశ్, అల్లూరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, పలు కాలనీలకు చెందిన పత్రినిధులు పాల్గొన్నారు.