బడంగ్‌పేట, నవంబర్ 11 : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కుర్మల్‌గూడలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో శ్మశాన వాటికలు అధ్వానంగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వైకుంఠ ధామాల రూపు రేఖలు మారిపోయాయి. స్నానాల గదులు, దింపుడు కల్లం, వెయిటింగ్ హాల్, రెండు బర్నింగ్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ, గేట్ కూడా ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డు నిర్మించి, బోరు వేశారు. మోటర్‌ను బిగించాల్సి ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
15 రోజుల్లో పనులు పూర్తి చేయిస్తాం
కుర్మల్‌గూడలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక పనులు 15 రోజుల్లో పూర్తి చేయిస్తాం. ఇప్పటి వరకు పూర్తయిన పనులను పరిశీలిస్తాం. అభివృద్ధి పనులకు రూ.30 లక్షలు మంజూరు చేశారు. నిధులు మిగిలితే శ్మశాన వాటిలో మొక్కలు నాటిస్తాం. ప్రస్తుతం పనులు చివరి దశకు వచ్చాయి. త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం.
– జ్యోతి రెడ్డి, డీఈఈ