సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశ పెట్టారు. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6,224 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ బడ్జెట్ అంచనాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. ఈ బడ్జెట్ ముసాయిదా పై సభ్యులు లేవనెత్తిన అంశాలను కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్ సమాధానాలు ఇచ్చారు. జనవరి 10 వరకు బడ్జెట్‌ను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెడతారు.
బడ్జెట్ ముసాయిదా వివరాలు
స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆరు అంశాలకు కమిటీ ఆమోదం..
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కమిటీ సభ్యుల సహకారంతో స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆరు అంశాలకు గాను ఆరింటికి సభ్యులు ఆమోదం తెలిపారని మేయర్ చెప్పారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, ఇ.విజయ్ కుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, సీఎన్ రెడ్డి, వై.ప్రేమ్ కుమార్, సామల హేమ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన ఆరు అంశాలు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం, మైలార్ దేవ్ పల్లి సర్వే నెం. 93/ఏ నంబర్ లో గల 1560 చ.గజాల ఓపెన్ ల్యాండ్‌ను బతుకమ్మ ఫ్లాట్ ఫామ్‌గా అభివృద్ధి చేయడం గానీ స్థల సేకరణ చేసేందుకు భూమి యజమాని ప్రభాకర్ రెడ్డికి 60 శాతం నష్టపరిహారం జీహెచ్ఎంసీ చెల్లించుటకు, మరో 40 శాతం టీడీఆర్ జారీ చేయుటకు కమిటీ ఆమోదం తెలిపింది