సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్లో సొంత వాహనాలపై చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ధరలు అందుబాటులోకి రావడం, రుణ సదుపాయం కల్పిస్తుండటం, రవాణాకు సౌకర్యంగా ఉండటంతో మధ్య తరగతి వారూ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై అవగాహన పెంచుకుంటే మైలేజీతో పాటు వాహనాలు నాణ్యతగా ఉంటాయని చెబుతున్నారు.
గేర్లపై అవగాహన అవసరం
గేరు మార్చడంలోనూ అవగాహన చాలా అవసరం. ఇష్టానుసారంగా గేరు మార్చకూడదు. క్లచ్ మీద కాలు ఒత్తి పెట్టి ఉంచకూడదు. కారు కదిలిన వరకే మొదటి గేరులో ఉండాలి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా రెండో గేరులో కారు నడుస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా కారు ఆగిపోతుందో అప్పుడే మొదటి గేరు అవసరం. దిగువకు రహదారులన్నప్పుడు గేర్‌లోనే నడిపించాలి. ఈ పరిస్థితుల్లో న్యూట్రల్‌కు తీసుకురాకూడదు. కిందకు కారు దిగుతున్నప్పుడు ఇంజిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. రహదారుల మీద వాహనాలు నిలిచిపోయినప్పుడు లేదంటే ఎక్కువ సమయం సిగ్నళ్లు పడినప్పుడు కారు ఇంజిన్‌ను ఆపేయడం ఉత్తమం. పరిమితికి మించిన బరువు వాహనంలో లేకుండా చూసుకోవాలి.
సమయానికి సర్వీసింగ్ ఇవ్వాలి
కారు అద్దాలు ఎప్పుడూ తెరవకుండా చూసుకోవాలి. అద్దాలు ఏమాత్రం కిందకు దించినా.. గాలి లోపలికి వెళ్లి కారు ముందుకు కదలడానికి ఎక్కవ శక్తి ఖర్చవుతోంది. అలాగే ఎండలో నిలిపిన కారు దాదాపు 10-15 నిమిషాలు ఏసీ వేస్తే తప్ప చల్లబడదు. ఫలితంగా ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. నీడ చూసుకుని కారును పార్క్ చేస్తే మంచిది. సమయానికి సర్వీసింగ్ అనేది చాలా ముఖ్యం.
ఈ సూచనలు పాటిద్దాం