సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పదేండ్లు దాటితే ఆధార్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ తన కార్యాలయంలో ఆధార్ అప్డేట్ అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.