ఖైరతాబాద్, నవంబర్ 9: విధి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టు నందగిరి శ్రీధర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సీనియర్ జర్నలిస్టులు, శ్రీధర్ మిత్ర బృందం బుర్ర శ్రీనివాస్, రమణకుమార్, మల్లేశ్ బాబు, నరేంద్ర గోకవరపు, సిద్దు నేతృత్వంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం శ్రీధర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు. శ్రీధర్ కుటుంబానికి మీడియా అకాడమి నుంచి రూ.1లక్ష చెక్కుతో పాటు నెలకు మూడు వేల చొప్పున ఐదు సంవత్సరాల పాటు పించన్ అందజేస్తామన్నారు. అనంతరం బిజినెస్ జర్నలిస్టుల ఫోరం, జీ తెలుగు ఉద్యోగులు రూ.50వేల విరాళాన్ని శ్రీధర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ తల్లిదండ్రులు నందగిరి భిక్షపతి, రేణుక, భార్య అనిత, తదితరులు పాల్గొన్నారు.