ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మల్కాజిగిరి, నవంబర్ 9 : పేద ఇంటి ఆడ బిడ్డ ఇంట్లో పెండ్లి బాజాలు మోగాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 105 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేద కుటుంబంలోని ఆడ బిడ్డ పెండ్లీలకు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారని, పేద ఇంటి ఆడ బిడ్డల పెండ్లీలు అంగరంగ వైభవంగా జరగడానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేస్తున్నారని అన్నారు. 105కుటుంబాలకు రూ.1.5కోట్ల ఆర్థిక సాయం అందజేశామన్నారు.
దరఖాస్తు చేసిన వారికి పార్టీలకతీతంగా అందరికీ మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, అల్వాల్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రేణుక, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, సునీతయాదవ్, మీనారెడ్డి, సబితాకిశోర్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, రాముయాదవ్, అమినుద్దీన్, ఉపేందర్, బాబు, సంపత్‌రావు, కన్నా, సూరి, బాలకృష్ణ, భాగ్యనందరావు, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఈస్ట్ఆనంద్బాగ్ డివిజన్ హనుమాన్‌నగర్‌లో రూ.25లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. సర్కిల్లోని అన్ని డివిజన్లలోని రోడ్లను సర్వే చేయించామన్నారు. అవసరమైన కాలనీల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని, గుంతలు పడిన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, డీఈలు లౌక్య, మహేశ్, ఏఈ శ్రీకాంత్, అధికార ప్రతినిధి జీఎన్వీ సతీశ్‌కుమార్, మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, సత్యమూర్తి, శ్రీనివాస్, రాముయాదవ్, బాబు, అమినుద్దీన్, సంపత్‌రావు, ఉమాపతి, బ్రహ్మయ్య, భాగ్యనందరావు, సత్తయ్య, మల్లేశ్, ఇబ్రహీం, ఆదినారాయణ, నహీంఖాన్, మబ్బు, షకిల్, దినేశ్, కిశోర్, గీతగుప్త, వైశాలి తదితరులు పాల్గొన్నారు.