కుత్బుల్లాపూర్,నవంబర్ 6 : కొంపల్లిలో ఆస్పియస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉత్తర హైదరాబాద్(నార్త్ సిటీ)పై దృష్టి సారించేందుకు మొదటిసారిగా క్రెడాయ్(కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన 12వ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణ రంగ సంస్థల స్టాల్స్‌ను కస్టమర్లు సందర్శించి ప్రాపర్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన హోండా యాక్టివా వాహనాన్ని జూబ్లీహిల్స్‌కు చెందిన కస్టమర్ టి.భూపాల్‌రెడ్డి లక్కీడ్రాలో గెలుచుకున్నాడు. కస్టమర్లకు క్రెడాయ్ సంస్థపై ఉన్న నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా అందిస్తామని పేర్కొన్నారు. ప్రాపర్టీ షోను జయప్రదం చేసిన కస్టమర్లకు, ప్రముఖులకు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.