కుత్బుల్లాపూర్, నవంబర్ 6 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ఒక ఎజెండాతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాలు ఆయనను కలిసి.. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే.. వారిచ్చిన సమస్యలపై అధికారులతో మాట్లాడి.. పరిష్కరించాలని ఆదేశించా రు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
గాజులరామారం, నవంబర్ 6 : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివే కానంద్ అన్నారు. గాజులరా మారం డివిజన్, పెద్దమ్మనగర్లో రూ.50 లక్షలతో భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయించిన సందర్భంగా ఆదివారం కాలనీ సంక్షేమ సం ఘం సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయనకు శాలువ కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు జ్యోతి, నగ్మ, మనోహర్, రాము, ఆరీఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.