మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ప్రధానంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చారు. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీకి కనువిప్పు కలిగించారన్నారు.
– సికింద్రాబాద్, నవంబర్ 6