సైదాబాద్, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించటంతో మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలక్‌పేట మల్లేశ్, పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్లో సంబురాల్లో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చి, మిఠాయి పంచుకున్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేశ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఆమోదించటంతోనే ప్రజలు గెలిపించారన్నారు. రాబోయే జనరల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడు పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగ్, కావేటి ధర్మరాజ్, గడ్డం నందు, పరమేశ్ ముదిరాజ్, రాచకొండ రమేశ్, సంతోష్, శ్రీకాంత్, చందు, గణేశ్ పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించటంతో మలక్‌పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో అజంపురా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించారు. మలక్‌పేట నియోజకవర్గం సీనియర్ నాయకులు మలక్‌పేట మల్లేశ్ ఆధ్వర్యంలో నియోజక వర్గం వ్యాప్తంగా విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో..
యాకుత్‌పురా నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సిటీ కేఫ్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.