మణికొండ/శంషాబాద్ రూరల్/అత్తాపూర్/మైలార్‌దేవ్‌పల్లి, నవంబర్ 6: మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ విజయఢంకా మ్రోగించడంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలను హోరెత్తించారు. ఆదివారం జరిగిన మునుగోడు ఓట్ల లెక్కింపు మొదటి నుంచి అన్ని రౌండ్లల్లో టీఆర్ఎస్ ఆధిపత్యంతో దూసుకుపోవడం పార్టీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకమేనని పార్టీ శ్రేణు లు సంతోషం వ్యక్తపర్చారు. అన్నివర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌కే మద్దతు పలుకుతున్నారడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10 వేల పైచీలుకు మెజార్టీతో అఖండ విజయాన్ని నమోదుచేసుకోవడంపై నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీలలో పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు.
అదే విధంగా శంషాబాద్, రాజేంద్రనగర్ పట్టణంలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయి లు పంచుకుని, బాణసంచాలను పేల్చి తమ సంబరాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, మణికొండ మున్సిపాలిటీ ప్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మణికొండ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్, మాజీ ఎంపీపీ మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మ, పార్టీ నాయకులు హరిశంకర్, క్రాంతికుమార్, విష్ణువర్థన్‌రెడ్డి, మల్లేశ్ యాదవ్, గణేశ్, ముస్తాక్, అనిల్, ప్రియదర్శిని, శ్రీనివాస్, కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.