మేడ్చల్ జోన్ బృందం, నవంబర్ 6: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువడంపై మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సంబురాలు జరుపుకున్నాయి. స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. నృత్యాలు చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఇకనైనా తీరుమార్చుకోవాలని హితవు పలికారు.
న్యాయమైన తీర్పునిచ్చిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ పట్టణంలో జరిగిన సంబురాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రమేశ్, నాయకులు భాస్కర్‌యాదవ్, మర్రి నర్సింహారెడ్డి, రాజమల్లారెడ్డి, సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గౌడవెల్లిలో జరిగిన సంబురాల్లో గ్రామ మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, నాయకులు సదానందగౌడ్, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్బాను, విష్ణు, యుగపతి పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లపోచంపల్లి, కండ్లకోయలో సంబురాలు జరిగాయి. మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, పార్టీ అధ్యక్షుడు సంజీవగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. నాగారంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, నేతలు పాల్గొన్నారు. దమ్మాయిగూడలో మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. చైర్పర్సన్ ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పోచారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ సురేశ్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. అఫ్జల్ఖాన్, కుమార్, మురళిచారి, ఆంజనేయులు, అశోక్, బాలు, ప్రకాశ్, భరత్, నరేశ్‌యాదవ్, సయ్యద్ ఉమర్, రాము, రమేశ్ పాల్గొన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. మేయర్ కావ్య, డిప్యూటీ మేయ ర్శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్‌సభ్యులు, అయ్యప్ప పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో మున్సిపాలిటీ మేయర్ వెం కట్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్లు, నాయకులు, మహిళలు, యూత్ నాయకులు పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు. బోడుప్పల్లో నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.