మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచిపెడుతూ..టీఆర్ఎస్ జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదా లు చేశారు. గులాబీ పతాకాలు చేతపట్టి నృత్యాలు చేశారు. ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలారు. ఈమేరకు ఉప్పల్, హబ్సిగూడ, చిలుకానగర్, నాచారం, రామంతాపూర్, మ ల్లాపూర్, హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, ఏఎస్‌రావునగర్, కాప్రా, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి సంబురాలు జరుపుకున్నారు.
– ఉప్పల్ జోన్ బృందం, నవంబర్ 6
చిలుకానగర్‌లో కార్పొరేటర్లు శాంతిసాయిజెన్ శేఖర్, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేపట్టారు. సంబురాల్లో ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సం తోష్రెడ్డి , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డివిజన్లో జరిగిన సంబురాల్లో కార్పొరేటర్ స్వర్ణరాజు, సుడుగు మహేందర్‌రెడ్డి, నాయకులు బంక వెంకటేశ్, గిల్బర్ట్, మచ్చపాండు, పవన్, శ్రీకాంత్‌గౌడ్, సోమనాథ్, బాలునాయక్, సతీశ్‌రెడ్డి, చందు, మల్లారెడ్డి, నరసింహ, పిల్లి సాయి, శివకుమార్, ఎండీ అలీ, గణేశ్, వంశరాజ్ రాజేశ్, శ్రీనివాస్, సురేఖ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో టీఆర్ఎస్ ఆధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. సంబురాల్లో డివిజన్ ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి, నాయకులు కందుల లక్ష్మీనారాయణ, బేతాల బాల్‌రాజు, బాల్శెట్టి, మురళీపంతులు, ఏనుగు సీతారామిరెడ్డి, శిరీష, పరిమళ, మల్క రామాదేవి, దుర్గా, సజ్జ రామతులసీ, సింగారపు మణెమ్మ, ఏనుగు మంజు ల, సింగారాపు రాజు, సురేంద్రచారి, కృష్ణ, రాజిరెడ్డి, రాజుయాకయ్య, గడ్డం శ్రీను, బాజీబాషా, రాజశేఖర్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌బీకాలనీ డివిజన్ ప్రధాన రహదారిలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు.
చౌరస్తాలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. సంబురాల్లో నాయకులు కుంటి కృష్ణ, తండా వాసుగౌడ్, ఫైళ్ల ప్రవీణ్, నెమలి రవి, ధర్మారెడ్డి, నాగారం బాబు, దుర్గయ్య, కోటేశ్వరి, శోభ, మంజుల, రఘు, ప్రభాకర్‌రెడ్డి, భూష ణం శ్రీను, రా పోలు శ్రీను, పద్మారెడ్డి, శ్రావణ్, జయరాజ్, రమణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన రహదారిలో టీఆర్ఎస్ నాయకులు మస్తాక్, కుమారస్వామి, సంధ్య, గరిక సుధాకర్, జానకి, తదితరులు ర్యాలీ నిర్వహించారు.