మాదన్నపేట, నవంబర్ 5 : విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ క్రమంలో పాత నగరంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టింది. కుర్మగూడ డివిజన్లో నిజాంకాలం నాటి పైపులైన్లను వాటర్ వర్క్స్ అధికారులు తొలగించి నీరు కలుషితం కాకుండానూతనంగా పైపులైన్ పనులు చేపడుతున్నారు. కాలనీల్లో తాగునీటి సమస్యలు లేకుండా కృషి చేస్తున్నారు. కుర్మగూడ డివిజన్లోని భరత్‌నగర్, ఎరుకల బస్తీ, నూర్ మజీద్ వద్ద మురుగు నీరు నిలువకుండా సాఫీగా వెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త పైపులైన్ ద్వారా కుర్మగూడ డివిజన్ ప్రజలకు కలుషిత నీటి సమస్య తీరనున్నది. పెరిగిన జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాత పైపులైన్లను తొలగించి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ.. నూతన పైపులైన్లను ఏర్పాటు చేస్తుడడంతో బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు మురుగునీరు తాగునీటి పైపులైన్లో కలిసి కలుషితం అయ్యేవి. మురుగు నీరు ఇంట్లోకి వచ్చేవి. ఈ సీవరేజీ పనులు చేయడం ద్వారా త్వరలో సమస్యలు పరిష్కారం కానున్నాయని అధికారులు అంటున్నారు.
కలుషిత నీటి సమస్యను పరిష్కరిస్తాం..
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అభివృద్ధి ప నులు చేపడుతున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులు సకాలంలో పూర్తి చేస్తాం. వరదనీరు, మురుగు నీరు ప్రవాహం రోడ్ల పైకి రాకుండా చర్యలు చేపడుతన్నాం. ప్రభావిత ప్రాంతాలను గుర్తించి తాగునీరు కలుషితం కాకుండా చూస్తాం.
– కలీముద్దిన్, ఏఈ వాటర్వాటర్ వర్క్స్