బంజారాహిల్స్,నవంబర్ 5: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు మధ్యన దూరాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన లింక్ రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం. 5 నుంచి అన్నపూర్ణ స్టూడియో ప్రధాన గేటు మీదుగా బంజారాహిల్స్ రోడ్ నం. 2వరకు లింక్ రోడ్డు వేయడం ద్వారా ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారితో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలని పదేండ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే అన్నపూర్ణ స్టూడియోకు చెందిన స్థలాన్ని సేకరించాల్సి రావడం, అక్కడ ఉన్న వాటర్సంపును తొలగించాల్సి ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. ఇటీవల హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద లింక్ రోడ్డు పనులను ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రూ.2.42కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం..
రూ.2.42కోట్ల అంచనా వ్యయంతో రెండునెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ కార్యాల యం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రధాన గేటు మీదుగా బం జారాహిల్స్ రోడ్ నం. 2 వైపుకు సుమారు 400 మీటర్ల మేర లింక్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భారీగా ఉన్న కొండను తవ్వుతున్నారు. ఈ లింక్‌రోడ్డు కో సం అన్నపూర్ణ స్టూ డియో గేటు వద్ద కొం త స్థలాన్ని వదిలిపెట్టేందుకు ఇటీవల హీరో అక్కినేని నాగార్జున అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే స్టూడియో ప్రహరీకి, ప్రతిపాదిత కొత్త రోడ్డుకు మధ్యన హైటెన్షన్ లైన్లు ఉండడంతో దాన్ని వదిలిపెట్టి మిగిలిన ప్రాంతంలో తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఇదే ప్రాంతంలో మంచినీటి లైన్లు కూడా ఉండడంతో రెండోదశలో అక్కడ తవ్వకాలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 3కిలోమీటర్ల దూరం తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాలనుంచి బంజారాహిల్స్ రోడ్ నం. 2, కేబీఆర్ పార్కు, బంజారాహిల్స్ రోడ్ నం. 14, రోడ్ నం. 10, 12 తదితర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ప్రస్తుతం చుట్టూ తిరిగి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే కమలాపురి కాలనీ, సాగర్ సొ సైటీ మీదుగా వెళ్లాల్సి ఉం టుంది. దాంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఇబ్బందు లు పడడంతో పాటు సు మారు 3కిలోమీటర్ల దూరం ప్రయాణించా ల్సి ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న లింక్ రోడ్డు పూర్తయితే ఆయా ప్రాంతాలనుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నం. 2కు చేరుకునే అవకాశం ఉంటుంది.
రెండునెలల్లో పనులు పూర్తిచేయిస్తాం..
జూబ్లీహిల్స్ రోడ్ నం. 5 నుంచి అన్నపూర్ణ స్టూడియో లింక్ రోడ్డు పనులను జనవరిలోగా పూర్తిచేయిస్తాం. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కానీ పునులు ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఏడాది క్రితం రూ.2.42కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండునెలల క్రితం పను లు ప్రారంభించింది. పనులు పూర్తయితే నియోజకవర్గం తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. – దానం నాగేందర్,
ఎమ్మెల్యే