గౌతంనగర్, నవంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతున్నదని, అర్హులంరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మౌలాలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో రూ.2.62కోట్లతో చేపట్టే అభివృ ద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.1.63కోట్లతో భరత్‌నగర్ బస్తీలోని ప్రధాన మార్గంలో బాక్స్డ్రైన్, సీసీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లు, రూ.44.50లక్షలతో సంతోషిమానగర్‌లో సీసీ రోడ్లు, రూ.14.90లక్షలతో హనుమాన్‌నగర్‌లో సీసీ రోడ్లు, సెంకడ్ బస్‌స్టాప్ ఏరియాలో రూ.32ల క్షలతో సీసీ రోడ్లు, రూ.8లక్షలతో సాదుల్లానగర్ శ్మశానవాటికలో ఫుత్‌పాత్ నిర్మాణానికి ఎమ్మెల్యే శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డు తూ.. మౌలాలి డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం దాదాపుగా రూ.12కోట్ల నిధులను మంజూరు చేయించానని తెలిపారు. సమస్యలను నేరుగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులను మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. దాదాపుగా 25 నుంచి 30 సంవత్స రాల క్రితం వేసిన రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని అందుకే నిధులను మంజూరు చేయించి నూతనంగా రోడ్ల పనులు ప్రారంభించామని తెలిపారు. మౌలాలిలో ఎక్కువగా బస్తీలు ఉన్నాయని, త్వరలోనే అన్ని ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే సీసీ రోడ్ల పనులను పూర్తి చేస్తామని, ఏండ్ల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందు లు ఇక తొలిగిపోతాయని ఆయన తెలిపారు.
మంగళహారతులతో స్వాగతం…
భరత్‌నగర్‌లో సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ఎమ్మెల్యేకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ముందు గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, డీఈ మహేశ్, ఏఈ మధురిమ, టీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, జీఎన్వీ సతీశ్‌కుమార్, పిట్ల శ్రీనివాస్, భాగ్యానందరావు, మౌలాలి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సత్తయ్య, మంద భాస్కర్, పూలపల్లి జగదీశ్‌యాదవ్, సంతోశ్ నాయుడు, ఆదినారాయణ, ఇబ్రహీం, ఎంఐఎం మౌలాలి అధ్యక్షుడు నాజిద్, గౌలికార్ శైలేందర్, గౌలికార్ దినేశ్, మోహన్‌రెడ్డి, రాందాస్ సంతోశ్, చందు, సందీప్‌గౌడ్, రఘుయాదవ్, మబ్బు, నహీమ్ఖాన్, షకిల్, దుర్గేశ్, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.