కవాడిగూడ, నవంబర్ 5: తాగునీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని శివసాయి అపార్ట్మెంట్ లైన్, అడ్వకేట్ కాలనీలో రూ. 14.30 లక్షల నిధులతో తాగునీటి, డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఆయ న కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, జలమండలి డీజీఎం కార్తిక్‌రెడ్డి, సెక్షన్ మేనేజర్ శ్రీధర్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కవాడిగూడ డివిజన్లో తాగునీటి, డ్రైనేజీ సమస్యలపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్లో ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. రవీందర్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఆర్. రాంచందర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు ఆర్. రాజేశ్, బి. విశ్వనాథ్, ప్రభాకర్, మధు, శ్రీశైలం, వల్లాల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు మహేందర్ బాబు, జి. వెంకటేశ్, పరిమళ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆశ వర్కర్లకు చీరల పంపిణీ ..
పేదలకు మెరుగైన వైద్యం అందించినప్పుడే మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని డీబీఆర్ మిల్స్ యూపీహెచ్‌సీలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా మెదిలి వారి మన్ననలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ అవంతి, టీఆర్ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, భోలక్‌పూర్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, ఆర్. రాజేశ్, ఆర్. రాంచందర్, దుర్గస్వామి, ఎ. శంకర్‌గౌడ్, యూపీహెచ్సీ పీహెచ్ఎన్ విజయలక్ష్మి, ఏఎన్ఎం సుశీల, ఆశ వర్కర్లు సుశీల, సంధ్య, రూప, పావని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.