ఎర్రగడ్డ, నవంబర్ 2: సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాలు ఆచరిస్తున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన 13 మంది లబ్ధిదార్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి దిక్సూచి పాత్రను పోషిస్తున్న తెలంగాణను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లటానికి కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌లు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచాయనడంలో సందేహం లేదన్నారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలను ఎంతో ఆదుకుంటున్నాయన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అర్హులైన అందరికీ చెక్కులు మంజూరవుతాయని భరోసా ఇచ్చారు. లబ్ధిదార్లకు చెక్కులతో పాటు తన తరఫున కానుకలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్‌బేగం, బాలానగర్ తాసీల్దార్ అహల్య, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, గంట మల్లేశ్, రొంపి ప్రభాకర్, మహ్మద్సర్దార్, మహ్మద్‌అహ్మద్, మహ్మద్‌ముస్తాక్, అజీమ్, రాము, శ్రీకాంత్, నర్సింగ్‌రావు, రసూల్, రఘు, జులేఖా, సుజాత, దయాకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 2 : నాణ్యతా ప్రమాణాలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో రూ.31.40 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో వాడవాడలా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తమ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఉపేక్షించబోమని.. త్వరితగతిగా అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాలని.. సరైన లెవల్ పాటించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.