కీసర, నవంబర్ 2: తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత కులవృత్తులను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే రజకుల దోభీఘాట్లు, లాండ్రీషాపులు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నది. కరెంట్ బిల్లుల విషయమై రజకులు, నాయీబ్రాహ్మణ నాయకులు గతంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి క్షౌరశాలలు, లాండ్రీలు, దోభీఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించేలా సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి రజకులు, నాయీబ్రహ్మణుల దుకాణాలకు విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేకుండా పోయింది. కీసర మండలంలోని 10 పంచాయతీల్లో మొత్తం 30 మంది నాయీబ్రాహ్మణులకు, 130 మంది రజకులు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో 28మంది నాయీబ్రహ్మణులకు, 125 మందికి రజకులనుఉచిత విద్యుత్ కోసం ఎంపిక చేశారు. మొత్తం మండలం లో 151మందికి ఉచిత విద్యుత్ కింద బిల్లులను విద్యుత్ ఖాతాలో జమ చేస్తున్నట్లు కీసర విద్యుత్‌శాఖ ఏఈ అనిల్‌కుమార్ తెలిపారు.
మండలంలో మొత్తం 151మంది లబ్ధిదారులకు ఉచిత విద్యుత్‌ను అం దిస్తున్నాం. ఏప్రిల్ నెల నుంచి ప్రభు త్వం నుంచి ఆదేశాలు రాగానే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిం చాం. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ప్రభుత్వ ఆదేశానుసారం ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. -అనిల్‌కుమార్,విద్యుత్ ఏఈ కీసర
20 సంవత్సరాల నుంచి తాము తమ కులవృత్తి అయిన నాయీబ్రహ్మణ వృత్తిని చేస్తున్నాం. ప్రతి రోజూ పొద్దంతా కష్టపడితే రూ. రూ.1000 వరకు వస్తుంది. అందులో రూ. 500 ఖర్చు పోను మిగతా రూ.500వరకు ఆదాయం వస్తుంది.ప్రతి నెల రూ. 700 నుంచి రూ.1000 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పుడు విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయింది. మా కష్టాన్ని గుర్తించి, ఉచిత విద్యుత్‌ను అందించిన సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణడి ఉంటాం.
-పగిడిపాల శ్రీకాంత్,నాయీ బ్రాహ్మణుడు, కీసర
8 సంవత్సరాల నుంచి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదు. గతంలో బొగ్గులతో ఇస్త్రీ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ప్రస్తుతం కరెంట్ పెట్టెతో ఇస్త్రీ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.
-జూపల్లి అశోక్ రజకుడు, కీసర