వజ్రాలు, బంగారానికి ఏమాత్రం తీసిపోనంటూ హొయలు పోయింది అందాల భామ రాశీఖన్నా. కొండాపూర్‌లోని ఓ మాల్లో వజ్రాభరణాల స్టోర్‌ను ప్రారంభించిన ఆమె.. కుర్రకారు మది పోగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది.
వినియోగదారులకు నాణ్యతతో కూడిన అద్భుత డిజైన్లలో వజ్రాల ఆభరణాలని అందించేందుకు కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్లో హరికృష్ణ గ్రూపుకు చెందిన ‘కిస్న గోల్డ్ అండ్ డైమండ్ స్టోర్’ను ప్రారంభిస్తున్నట్లు హరి కృష్ణ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ డోలాకియా తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై ఘన్‌శ్యామ్, డైరెక్టర్ పరాగ్‌తో కలిసి ప్రారంభించారు.