గౌతంనగర్, అక్టోబర్ 20: మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్‌లోని శాంతినగర్, భగత్‌సింగ్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాల్లో రూ.1.10కోట్ల నిధులతో సీసీ రోడ్ల పనులను ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు , తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయించి.. అభివృద్ధి పనుల ను చేపడుతున్నామన్నారు. కోట్లాదిరూపాయలతో డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, డ్రైనేజీ నిర్మా ణం పూర్తి చేసిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని అన్నారు. బస్తీలు, కాలనీ సంక్షేమ సంఘాలు తన దృష్టికి సమస్యలను తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజల అభివవృద్ధి కోసం బీఆర్ఎస్(టీఆర్ఎస్) ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేశ్, ఏఈ సృజన, బీఆర్ఎస్ నాయకులు ఉపేందర్‌రెడ్డి, జీవకన్, మహత్య వర్ధన్, ఎస్ఆర్ ప్రసాద్, చిత్రగోకుల్, జీఎన్వీ సతీశ్‌కుమార్, చెన్నారెడి, మహేశ్, శ్రావణ్ కుమార్, గోపినాథ్, రాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.