మర్రిగూడ, అక్టోబర్ 20 : మిషన్ భగీరథ పథకంతో తాగునీటిని తెచ్చి బతుకుకు భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని దామెర, భీమనపల్లిలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారుగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వందల ఎండ్ల నుంచి మునుగోడుకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని వదిలించింది సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు నోరుతెరిచి అడిగినా కాంగ్రెస్, టీడీపీ పాలకులు తాగునీరివ్వలేదన్నారు. కండ్లముందే దివ్యాంగులవుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఆరేండ్లు ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కావాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ విజయం కాదా అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఫ్లోరోసిస్‌ను అంతం చేసిన కేసీఆర్ వైపు మునుగోడు ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో మునుగోడుకే అధికంగా రైతుబంధు నిధులు వస్తున్నాయన్నారు. రాజగోపాల్‌రెడ్డి సంపన్నుడు కావచ్చు.. కానీ, ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులని డబ్బు, మద్యం వాళ్ల ముందు నిల్వలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. ప్రజలకు కనబడకుండా తిరిగే దొంగ రాజగోపాల్‌రెడ్డికి కాకుండా ఎప్పుడూ అందుబాటులో ఉండే కూసుకుంట్లకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
సామాన్యుడే టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్
సామాన్యుడు టీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. మర్రిగూడ మండలం దామర భీమనపల్లి గ్రామానికి చెందిన దళితబిడ్డ జిల్లా రామలింగానికి టీఆర్ఎస్ అన్నా.. సీఎం కేసీఆర్ అన్నా ప్రాణం. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అభ్యర్థులు గెలువాలని వినూత్న ప్రచారం నిర్వహిస్తుంటాడు. కూరగాయలు, ఎండు చేపలు అమ్మే రామలింగం రోజూ గ్రామం నుంచి దేవరకొండ వరకు వెళ్తుంటాడు. తన స్కూటీకి అమర్చిన మైక్‌తో సంక్షేమ పథకాలను వివరిస్తుంటాడు. మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామంలో ప్రచారం చేస్తుండగా రామలింగం ఎదురుపడ్డారు. వినూత్నంగా ప్రచారం చేస్తున్న అతడిని మంత్రి అభినందించారు. రామలింగం లాంటి వారే టీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్లని అన్నారు.