కొండాపూర్, అక్టోబర్ 15 : సంస్కృతి, సంప్రదాయాలకు క్యాపిటల్‌గా మన దేశం ఉందని, వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది క్రియేటర్లని ఫేస్బుక్ (మెటా) ఇండియా డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ మనీష్ చోప్రా అన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన మెటా క్రియేటర్స్ డే వేడుకలకు ఆయన హీరోయిన్ రష్మిక మందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక రకాల భాషలున్నప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చేయడంలో క్రియేటర్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారన్నారు. క్రియేటర్లు మరింత అద్భుతంగా తమ రీల్స్‌ని రూపొందించడంలో ఉపయోగకరంగా ఉండేలా కొత్త ఏఆర్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రోగ్రామ్‌ను విడుదల చేసినట్లు మనీష్ చోప్రా తెలిపారు. ఇంట్లో కూర్చుని ఎంటర్టైన్ చేస్తున్న వారిలో క్రియేటర్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని, నటీనటులు సైతం క్రియేటర్స్ నుంచి ఇన్సిపిరేషన్ పొందుతున్నట్లు రష్మిక తెలిపారు.