మేడ్చల్, అక్టోబర్ 15: విద్యార్థులు బాధ్యతాయుతంగా మెలగాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ధ్రువ కళాశాలలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ మాట్లాడుతూ సమాజ ప్రగతి యువత చేతుల్లోనే ఉందన్నారు. సమాజ హితం కోసం పాటుపడుతూ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలసీ అండ్ రీసెర్చ్, ఫ్యూచర్ సిటీస్ ప్రెసిడెంట్ నేషనల్ ఇన్చార్జి కరుణగోపాల్, ఎమిరైటీస్ యూనివర్సిటీ ఆచార్యుడు డాక్టర్ డేవిడ్ సుమంత్, టీ హబ్ సీడీవో ఆంథోనీ, ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మాథ్యు తదితరులు పాల్గొన్నారు.