మియాపూర్/శేరిలింగంపల్లి/కొండాపూర్/ మాదాపూర్ , అక్టోబర్ 15 : ప్రభుత్వ విప్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివేకానందనగర్‌లోని గాంధీ నివాసం నియోజకవర్గ స్థాయిలో వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు,ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానుల నడుమ విప్ గాంధీ కేక్ కట్ చేశారు. భారీ గజమాలలతో విప్ గాంధీ దంపతులను కార్పొరేటర్లు ,ఆయా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు నేతలు సన్మానించారు. పూల మొక్కలు అందించి మిఠాయిలు తినిపించి శాలువాలతో సత్కరించారు. ఆటాపాటాలతో నివాస ప్రాంగణం సందడిగా మారింది. కాగా తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, అభిమానులు శ్రేయోభిలాషులకు విప్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.
థైశేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే, విప్ గాంధీ అరెకపూడి గాంధీ జన్మదిన వేడుకల నేపథ్యంలో శనివారం మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, హఫీజ్‌పేట్ కార్పొరేటర్ వి. పూజిత గౌడ్లు స్థానిక నాయకులతో కలిసి ఆయన నివాసానికి చేరుకొని శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన నివాసంలో హఫీజ్‌పేట్ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హఫీజ్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ శాలువా కప్పి గజమాలను వేసిన అనంతరం కేకును కట్ చేసి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఢ్పభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి పుట్టినరోజున ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి తదితరులు