కుత్బుల్లాపూర్, అక్టోబర్ 15 : కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో డబుల్ బెడ్రూంల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను అధికారులు మరింత ముమ్మరం చేశా రు. కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో 58,700 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 31,000, గాజులరామారం సర్కిల్ పరిధిలో 27,700 దరఖాస్తులు ఉన్నాయి. గాజులరామారం సర్కిల్ పరిధిలో 17,200 పరిశీలన చేయగా.. మరో 10,500 పరిశీలనకు ఉన్నా యి. కుత్బుల్లాపూర్ పరిధిలో 28,300 దరఖాస్తులు పరిశీలన చేయగా .. మరో 2,700 మందివి పరిశీలించాల్సి ఉంది. గతంలో అధికారులు దరఖాస్తుదారుల ఇంటికే వె ళ్లి పరిశీలించారు. అయితే.. ఇప్పుడు అది సాధ్యపడకపో వడంతో మిగిలినవారి దరఖాస్తులను కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లో పరిశీలన చేస్తున్నారు.
హెల్ప్‌డెస్క్ ద్వారా పరిశీలన…
జంట సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లలోకి నేరుగా వెళ్లి వివరాలను నమోదు చేశారు. మిగిలినవాటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు వీలుకాకపోవడంతో ప్రస్తుతం స్థానిక సర్కిల్ కార్యాలయాల్లోనే ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల పరిశీలన కానివారు..నేరుగా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి పరిశీలన చేసుకోవాలని, ఇందుకు గాజులరామారం సర్కిల్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ రవీందర్-9666681132, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ సత్యరాజ్-9959442308 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : డీసీలు
డబుల్ బెడ్రూంల కోసం దరఖాస్తు చేసుకుని.. పరిశీలన కానివారు … కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించాలని జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతి కోరుతున్నా రు. గతంలో ఇండ్లవద్దకు వెళ్లి సమాచారం సేకరించామ ని, ప్రస్తుతం మిగిలిన దరఖాస్తుదా రుల ఫోన్‌నంబర్లు, ప్రస్తుతం వారు ఉంటున్న అడ్రస్‌లు లేకపోవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటివారు నేరుగా స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించి.. దరఖా స్తులను పరిశీలన చేసుకోవాలని సూచించారు.