ఎర్రగడ్డ, అక్టోబర్ 15: గతంలో కనీస వసతులు కరువై నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయటం జరిగిందని, పేదలకు అండగా ఉండేది ఒక్క టీఆర్ఎస్ (బీఆర్ఎస్) సర్కారు మాత్రమేనన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. శనివారం బోరబండ డివిజన్ వీకర్‌సెక్షన్‌లోని రెండు ప్రాంతాల్లో రూ.58 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆజమ్నగర్ వద్ద ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. బోరబండ డివిజన్లోని దాదాపు అన్ని ప్రాంతాలు గత ప్రభుత్వాల హయాంలో మౌలిక సదుపాయాలకు నోచుకోలేదన్నారు. ముఖ్యంగా నిరుపేదలు ఉంటున్న వీకర్‌సెక్షన్ బస్తీలను పట్టించుకునే వారు లేకపోవటంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. గత ఏడెనిమిదేండ్లుగా దశలవారీగా పనులను పూర్తి చేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఏ డివిజన్‌ను గమనించినా.. అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయనటంలో అతిశయోక్తి లేదన్నారు. బోరబండ డివిజన్‌కు కోట్లాది రూపాయలను కేటాయింపజేసి అంతర్గత రోడ్లు, తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్లు, ప్రతి బస్తీకి కమ్యూనిటీహాల్ ఉండే విధంగా చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, ఏడీ మధు, వెంకటేశ్, ధర్మ, రమేశ్, బొట్టుశివ, యాదగిరి, బాబూరావు, యూసుఫ్, బాబానాయక్, కవిత, దేవమణి, బుజ్జమ్మ, చంద్రకళ, పద్మ, ముంతాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్లో రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. డివిజన్లోని ప్రేమ్‌నగర్, సుల్తాన్నగర్లలో ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాలను కార్పొరేటర్ షాహీన్బేగంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ గతంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ కార్యరూపంలోకి తీసుకువచ్చానని ఉదాహరణలతో సహా వివరించారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో అంతర్గత సీసీ రోడ్లు ఉండే విధంగా ప్రణాళికను తయారు చేసి దశలవారీగా పూర్తి చేయటం జరిగిందన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, గంట మల్లేశ్, మహ్మద్ సర్దార్, రూపేశ్, మహ్మద్‌అహ్మద్, ముస్తాక్, రాంచందర్, శ్రావణ్, శ్రీకాంత్, బాలకృష్ణ పాల్గొన్నారు.