సిటీబ్యూరో, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ శివారు ప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని తొర్రూర్, తుర్కయాంజాల్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల వివరాలతో జాబితాను రూపొందించారు. బహదూర్‌పల్లిలో 87 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 110 , తొర్రూరులో 148, తుర్కయాంజాల్‌లో 14 ప్లాట్లు విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్లాట్ల ఆన్లైన్ వేలాన్ని నవంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు లే అవుట్ల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీకి అప్పగించామన్నారు. https://www.mstcecommerce.com/లో సంప్రదించి, పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్ణీత ఫీజు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు.