మాదాపూర్, అక్టోబర్ 10: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండియన్ ఐస్ క్రీం మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇండియన్ ఐస్ క్రీం ఎక్స్ పో 2022 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సెక్రటరీ (ఎంఓఎఫ్పిఐ) అనితా ప్రవీణ్ విచ్చేసి.. హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్, ఐస్ క్రీం, న్యూట్రీషన్ డాక్టర్ సంగీత చడ్డా, ఐసిసి హైదారాబద్ హెడ్ నవీన్ మాడిషెట్, కన్సల్టెంట్ జనరల్ ఆఫ్ కెనడా, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, ఎన్బిఎస్ఓ నెదర్ల్యాండ్ రాంబాబు వేదాంతం, గుబ్బా కోల్డ్ స్టోరేజ్ ఎండీ నాగేశ్వర్రావు, నిథిమ్ డైరెక్టర్ ఎస్. చిన్నంరెడ్డి, నమీబియా ట్రేడ్ కమిషనర్ తస్నీమ్ షరీఫ్, ఆస్ట్రేలియా ట్రేడ్ కాన్సులేట్ రామకృష్ణ, రాక్వెల్ ఇండస్ట్రీ ఎండీ అశోక్ గుప్తాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఐస్ క్రీం పరిశ్రమలను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐస్ క్రీం పరిశ్రమ 20 వేల కోట్లకు పైగా వ్యాపారాన్ని చేరుకోవడం గొప్ప విషయమన్నారు. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 20 దేశాలకు చెందిన బ్రాండ్లు, ఫ్యాకేజింగ్ మెషినరీలు, ముడి పదార్థాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో స్కూప్ ఐస్ క్రీం అధ్యక్షుడు సుధీర్ షా, వాడిలాల్ ఇండస్ట్రి చైర్మన్ ఆశిష్ నహర్, ఏఐం ఈవెంట్స్ డైరెక్టర్ ఫిరోజ్ ఖ్వీ, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విక్రమ్ జైన్ పాల్గొన్నారు.