కందుకూరు, అక్టోబర్ 10 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మంత్రి కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలువురికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. మండల ఎంపీటీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మా దేవేందర్‌తో పాటు ఎంపీటీసీలు కాకి రాములు, లలితా కుమార్, సురేశ్‌కు మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికకు గ్రామాల బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని ఎంపీటీసీలు కలిశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తాండ్ర దేవేందర్, కుమార్ పాల్గొన్నారు.