సిటీ బ్యూరో, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఇతర మెట్రో నగరాలకు ధీటుగా అతి పెద్ద నివాస సముదాయాలు భారీగా వస్తున్నాయి. నానక్‌రాంగూడలో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా 57 ఫ్లోర్ల డైమండ్ టవర్స్, నానక్‌రాంగూడలో ఆపర్ణా కన్స్ట్రక్షన్స్ 50 అంతస్తుల టవర్.. నానక్‌రాంగూడ వేవ్‌రాక్ దగ్గరలో సుమధుర గ్రూప్ 44 అంతస్తులు.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఆకాశానికి నిచ్చెనలా హైరైజ్ బిల్డింగ్స్ దూసుకుపోతున్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనాల జాబితాలో మరొక ప్రాజెక్టు వచ్చి చేరింది. ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన రాయదుర్గంలో తొలి లగ్జరీ ప్రాజెక్ట్‌కు రాఘవ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టింది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారిలో 7.38 ఎకరాలలో ఐరిస్ పేరిట హై రైజ్ వెంచర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం మూడు టవర్లు, ఒకోటి 45 అంతస్తులలో ఉంటుంది. ఒకో టవర్ లో 180 ఫ్లాట్లు ఉంటాయి. ఫ్లోర్‌కు కేవలం నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 520 యూనిట్లు ఉంటాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేకంగా పనిమనిషి గది ఉంటుంది. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారులు విశాలమైన ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్‌లోని ఒకో ఫ్లాట్ 5,500 చదరపు అడుగుల నుంచి 6,600 చదరపు అడుగుల మధ్య ఉండేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మలక చెరువు, దుర్గం చెరువు వ్యూ లొకేషన్లో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిర్మాణ అనుమతులు కూడా వచ్చాయని, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ -రెరా)లోనూ ప్రాజెక్ట్‌ను నమోదు చేశామని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ చేస్తామని చెప్పారు.
హైరైజ్ అభివృద్ధి..
హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయని సుమధుర గ్రూప్ వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు. ల్యాండ్ మార్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయని చెప్పారు. ఎకువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయని, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వరింగ్ కపుల్స్ ఎకువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణం.. ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమేనని ఆయన స్పష్టం చేశారు. భూముల ధరలు ఎకువగా ఉన్న చోట తకువ స్థలంలోనైనా సరే హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. కోకాపేట, ఖాజాగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే ఎకువగా వస్తున్నాయని తెలిపారు.
హైరైజ్‌లో లాభాలు ఏంటంటే?
ఎత్తయిన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాలనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన వాతావరణంలో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు.