బాలానగర్, అక్టోబర్ 9 : కేపీహెచ్‌బీకాలనీ పరిధి.. వసంతనగర్కాలనీలో ముంపు సమస్య పునరావృతం కాకుండ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఆదివారం కేపీహెచ్‌బీకాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఆయన వసంతనగర్‌లో పర్యటించి ముంపు గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురుసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికావడం బాధాకరం అన్నారు. వసంతనగర్‌లో ముంపు సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
శనివారం రాత్రి ఎడతెరపిలేకుండా కురిసిన కుండపోత వర్షాలకు నాలా పరీవాహక ప్రాంతమైన కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఏవీబీపురంకాలనీ రోడ్డు నం.1, 2లు జలమయంకావడం తెలుసుకొని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆయా ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు గురించి స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ముంపు సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తక్షన కర్తవ్యంగా ఏయిర్‌టెక్ మిషన్కంప్రెషర్ మిషన్ ద్వారా వరదనీటిని తొలగిపంజేశారు. కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు రమణ, దారాసింగ్, నారాయణ, హీరంభరావు, విష్ణు, దనుంజయ్, వెంకట్రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసి కుండపోత వర్షానికి కేపీహెచ్‌బీకాలనీలోని పలు ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు శనివారం అర్ధరాత్రి కాలనీలోని పలు రహదారులలో పర్యటించి ముంపును స్వయంగా గమనించారు. రోడ్లపై నిలిచిన వరదతో పలు వాహనాలు సగం వరకు నీటిలో మునగడం బాధాకరం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరద వలన ఏర్పడిన ముంపునకు ఏర్పడిన అంతరాయానికి చింతిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ముంపు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని హబీబ్‌నగర్, శక్తినగర్, రాఘవేంద్రకాలనీలు నీటమునిగాయి. ఆయా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలుసుకున్న మూసాపేట మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు ఆయా ప్రాంతాలలో పర్యటించి ముంపు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యంగా ఉండాలని అధైర్యపడరాదని సూచించారు. పలు విభాగాల అధికారులతో చర్చించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.