రామంతాపూర్, అక్టోబర్ 9 : దళిత బంధు పథకం దళితులకు వరంటాంటిదని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిలుకానగర్‌లో దళిత బంధు ద్వా రా మంజూరైన మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకొని దళితులు ఆర్థికంగా ఎదగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కసుందర్, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, ఆలేరు వెంకటేశ్వర్‌రెడ్డి, జగన్, కొండల్‌రెడ్డి, రామానుజం, రవీందర్‌గౌడ్, నర్సింహ, రాంచందర్, శ్రీను, మహమూద్, శ్యామ్ పాల్గొన్నారు.
జ్ఞాన పాదయాత్ర ప్రారంభం..
జైభీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈసీఐఎల్ వరకు ఏర్పాటు చేసిన జ్ఞాన పాదయాత్రను ఆదివారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలిపెద్ది సుభాష్‌రెడ్డి, జహంగీర్, అసోసియేషన్ సభ్యులు దోశల శంకర్, మస్కసుధాకర్, గుండె రాజు, ఎర్రబాల్రాజు, మస్క ధన్‌రాజ్, శ్రీనివాస్, కృష్ణ, ఉప్పల జయదాసు, బాలకృష్ణ, రామచంద్ర, సుద్దాల రమేశ్, రవి పాల్గొన్నారు.